VIDEO: రోడ్లపైనే పారుతున్న మురుగునీరు
CTR: పుంగనూరు పరిధిలోని నక్కబండలో సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కాల్వలు లేక రోడ్లపైనే మురుగునీరు నిలిచిపోయింది. దీంతో పారిశుద్ధ్యం కొరవడింది. దుర్వాసన, దోమల బెడద ఎక్కువైందని స్థానికులు చెబుతున్నారు. వందలాదిమంది నివసిస్తున్న ఈ ప్రాంతంలో అరకొర సౌకర్యాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.