VIDEO: ఓపెన్ మ్యాన్ హోల్‌లో పడిపోయిన బాలిక

HYD: పాఠశాలకు వెళ్తున్న 6 సంవత్సరాల బాలిక ఓపెన్ మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఘటన పాతబస్తీ పరిధిలో చోటుచేసుకుంది. యాకుత్ పురాలో సిబ్బంది డ్రైనేజీ మూతను తెరిచి ఉంచడంతో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో పడిపోయింది. సకాలంలో స్పందించిన మహిళ చిన్నారిని క్షేమంగా బయటకు తీసింది. డ్రైనేజీ మూత తెరచి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.