ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. జాబ్ మేళా వాయిదా

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. జాబ్ మేళా వాయిదా

NGKL: అచ్చంపేట పట్టణంలో ఈ నెల 30న జరగాల్సిన జాబ్ మేళాను స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు సీబీఎం ట్రస్ట్ ఛైర్‌ పర్సన్ డాక్టర్ అనురాధ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నూతన తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.