జనరిక్ మెడికల్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: సంగెం మండలం గవిచర్ల గ్రామంలో జనరిక్ మెడికల్ సెంటర్‌ను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.