అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

VZM: రాజాం మండలం రాజయ్య పేట సమీపంలో పెట్రోల్ బంకు వద్ద ఫైర్ అధికారి అశోక్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ప్రమాదాలు జరిగితే చేపట్టాల్సిన చర్యలు తెలియజేశారు. ప్రతి బంకు వద్ద అగ్ని ప్రమాద నివారణ పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.