నాసరయ్యకు స్వాగతం పలికిన గ్రామస్తులు

నాసరయ్యకు స్వాగతం పలికిన గ్రామస్తులు

మార్కాపురం మండలం గజ్జలకొండకు చెందిన జమ్మలమూడి నాసరయ్య థాయిలాండ్‌లో వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్‌లో 5వేల మీటర్ల వాకింగ్ రేసులో ద్వితీయ స్థానం, 100 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం సాధించారు. గురువారం స్వగ్రామానికి చేరుకోగా అతనిని గ్రామస్తులు ర్యాలీ నిర్వహిస్తూ, వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు.