ఆదిలాబాద్ వెనకపడేసిన ప్రాంతం: బండి సంజయ్

TG: ఉమ్మడి ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదని, వెనకపడేసిన ప్రాంతమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. 'గతంలో HYD నుంచి ఆదిలాబాద్ వెళ్లాలంటే సగం రోజు గడిచేది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు జాతీయ రహదారులు 2500కి.మీ మాత్రమే ఉన్నాయి. పదేళ్లలో రాష్ట్రం కోసం కేంద్రం రూ.12 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోడెద్దుల్లాగా కలిసి నడవాలి' అని పేర్కొన్నారు.