యువకుడు ఆత్మహత్య.. కేసు నమోదు

యువకుడు ఆత్మహత్య.. కేసు నమోదు

NDL: కొలిమిగుండ్ల మండలంలోని హనుమంతు గుండం గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తన కుమారుడు రమేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి రాజమ్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు.