ప్రజలను వణికిస్తున్న చలి పులి
VKB: దౌల్తాబాద్, కొడంగల్ మండలాల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. సాయంత్రం, ఉదయం వేళలో ప్రజలు చలిమంటలు కాసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, చిన్న పిల్లలు, ప్రజలు జాగ్రత్త వహించాలని వైద్యాధికారులు సూచించారు.