BRS ఆధ్వర్యంలో బంద్ విజయవంతం

BRS ఆధ్వర్యంలో బంద్ విజయవంతం

SRPT: హుజుర్‌నగర్‌లో అఖిలపక్ష పార్టీ, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం ఆగదని తెలిపారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం, చట్టబద్ధత కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని పేర్కొన్నారు.