'నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం'
WGL: తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖానాపూర్ మండలం అయినపల్లి, ఖానాపురం గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గురువారం జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మండల అధికారులతో కలిసి దెబ్బతిన్న పంటలు సర్వే చేశారు. నష్ట వివరాలు ప్రభుత్వానికి అందజేస్తామని, త్వరలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.