ఘనంగా తిరునక్షత్ర మహోత్సవ వేడుకలు
RR: ముచ్చింతల్ శ్రీరామ నగరంలో శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామి వారి 1009వ తిరునక్షత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచరణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు రోజులపాటు వివిధ ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు.