పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

KMR: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసులో సోమవారం నిందితుడు చెర్ల ప్రశాంత్‌కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధించింది. 2025లో నమోదైన ఈ కేసులో సాక్ష్యాధారాలను పకడ్బందీగా సమర్పించిన పోలీసులను కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.