'విద్యార్థులు సమయ వేళలు పాటించే దిశగా కృషి చేయాలి'

SKLM: నరసన్నపేట మండలం పోతయ్య వలస ప్రాథమిక పాఠశాలను ఎంఈవో ఉప్పాడ శాంతారావు పరిశీలించారు. గురువారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఆయన మాట్లాడుతూ.. తప్పనిసరిగా విద్యార్థులు సమయ వేళలు పాటించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాన్ని వారి వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే దిశగా కృషి చేయాలన్నారు.