PM కిసాన్ నిలిపివేత.. కేంద్రం వివరణ
PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధిపొందుతున్న లక్షలాది మంది రైతులను తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదని వివరణ ఇచ్చింది. అలాగే ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ది పొందుతున్నట్టు గుర్తించి, అలాంటి వారికి తాత్కాలికంగా ఈ పథకాన్ని నిలిపివేశామంది.