మాకవరం ప్రజలకు నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు

మాకవరం ప్రజలకు నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు

అనకాపల్లి: మండలంలోని మాకవరం గ్రామములో నీటి ఎద్దడి ప్రారంభమైంది. గత పది రోజులుగా నీరు లేక గ్రామస్తులందరూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకపక్క తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండడంతో పసిపిల్లలు సైతం నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు విఫలమయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి ఎద్దటి  తీర్చాలన్నారు.