‘పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం’

‘పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం’

కోనసీమ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న 2.50 లక్షల గృహప్రవేశ మహోత్సవాల సందర్భంగా, అమలాపురం పట్టణం 30వ వార్డులో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు.