ఆరోగ్య ఉప కేంద్రాల నిధులు ఏమౌతున్నాయి?.. సీఐటీయూ

ఆరోగ్య ఉప కేంద్రాల నిధులు ఏమౌతున్నాయి?.. సీఐటీయూ

అల్లూరి: జిల్లాలోని 197 ఆరోగ్య ఉప కేంద్రాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుందరరావు ప్రశ్నించారు. సోమవారం పాడేరు మండలం మినుములూరు సబ్ సెంటర్‌ను సందర్శించిన ఆయన, అక్కడి దుస్థితిపై మండిపడ్డారు. కిటికీలు, తలుపులు పూర్తిగా పాడైపోయి భవనం అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.