వొకేషనల్ పరీక్షలు పూర్తి: డీఈఓ

వొకేషనల్ పరీక్షలు పూర్తి: డీఈఓ

KMR: జిల్లాలో పదో తరగతి వొకేషనల్ పరీక్షలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగిశాయని జిల్లా విద్యాధికారి రాజు గురువారం తెలిపారు. చివరి రోజు పరీక్షకు 1693 విద్యార్థులకు 1680 మంది పరీక్ష రాయగా, 13 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని డీఈఓ పేర్కొన్నారు.