ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలి?
USలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. నెలలు నిండని నవజాత శిశువులు రోజుకు 14-17 గంటలు నిద్రపోవాలి. అలాగే ఏడాది లోపు శిశువులు 12-16H, 3 ఏళ్లలోపు పసిబిడ్డలు 11-14H పడుకోవాలి. ప్రీస్కూలర్లు 10-13H, స్కూల్ వయసు పిల్లలు 9-12H, టీనేజర్లు 8-10H నిద్రపొవడం మంచిది. ఇక యువకులు-పెద్దలు(18-60) రోజులో 7-8H, 60+ వయసువారు 7-9 గంటలు పడుకోవడం ఆరోగ్యానికి మంచిది.