పోలీస్ ప్రజావాణిలో 13 ఫిర్యాదులు: ఎస్పీ
MDK: మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులను స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఫిర్యాదు దారులతో స్వయంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం చేసేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు సూచనలు చేసినట్లు వివరించారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు.