నాటక రూపంలో అంబేడ్కర్ చరిత్ర

SS: సోమందేపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో శుక్రవారం రాత్రి అంబేడ్కర్ చరిత్రను కళాకారులు కళాజాత రూపంలో చూపారు. అంబేడ్కర్ వేషధారణ వేసి నాడు జరిగిన కుల వివక్షత, చిన్న కులాల వారిపై జరిగిన దాడులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. రాజ్యాంగం యొక్క విశిష్టత, రాజ్యాంగ నిర్మాణం కోసం అంబేడ్కర్ పడిన కష్టాలను కళాకారులు కళ్ళకు కట్టినట్టు చూపించారు.