రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్
నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.పెండింగ్ లో ఉన్న భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.