సళేశ్వరం జాతరకు 3 లక్షలకు పైగా భక్తులు..!

NGKL: జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న సళేశ్వరం ఉత్సవాలకు మూడు రోజుల్లో దాదాపు 3 లక్షలకు పైగానే భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. ఈనెల 11 నుంచి 13 వరకు సళేశ్వరం ఉత్సవాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లింగామయ్యను దర్శించుకున్నారు. వరుసగా రెండు రోజులు ట్రాఫిక్ జామ్ అయింది.