టాప్ 25 కాలుష్య నగరాలు మన ఆసియాలోనే
2025 ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ సమీపంలోని 'లోని' అగ్రస్థానంలో నిలిచింది. చైనాలోని హోటాన్ రెండో స్థానంలో ఉంది. అత్యంత కాలుష్య పూరిత 25 నగరాలు భారత్, పాకిస్థాన్, చైనాలోనే కేంద్రీకృతమై ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 14% నగరాలు మాత్రమే WHO గాలి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఐస్‌లాండ్, పనామా వంటి దేశాల్లో గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంది.