సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ.1,91,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొరిమి ఓంకారం ఆదివారం పంపిణీ చేశారు. పేదల చికిత్సకు ఈ నిధి వరంగా మారిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుల ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక పీఏను ఏర్పాటు చేసి సాయం అందిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.