VIDEO: అమరావతిలో వేడుకగా సీతారాముల కల్యాణం
PLD: అమరావతిలోని కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు కనులపండువగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణానంతరం భక్తులకు వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా పంపిణీ చేశారు. రామయ్య నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.