క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

BPT: పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలో డా. డి.యస్. రాజు జూనియర్ కళాశాల 29వ క్రీడా వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాల్గొన్న పోటీలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ప్రతిభ కనబరిచి విజేతలైన విద్యార్థులకు పతకాలు, ట్రోఫీలు అందజేశారు.