VIDEO: ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన పద్మ దేవేందర్ రెడ్డి

VIDEO: ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన పద్మ దేవేందర్ రెడ్డి

MDK: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి జిల్లా ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది అనేది తెలుగు ప్రజల ఆత్మీయత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ అని పేర్కొన్నారు. ఉగాది పచ్చడి లాగా జీవితంలో తీపి, చేదు, పులుపు, ఉప్పు అన్నీ సమానంగా స్వీకరించాలని పండగ సూచిస్తుంది అన్నారు.