మద్యం సేవించి వాహనం నడిపిన ఏడుగురికి జరిమానా..!
CTR: మద్యం సేవించి వాహనాలు నడిపిన 7 మందిని చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం రూ.70వేలు జరిమానా విధించారు. అందులో ఇద్దరికి జరిమానాతో పాటు ఒక రోజు సాధారణ శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సీఐ నిత్య బాబు హెచ్చరించారు.