'శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి'
SKLM, ప్రముఖ పుణ్యక్షేత్రం జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఈనెల 15 నుంచి జరిగే శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రమణమూర్తి కోరారు. గురువారం ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక సమావేశం పాల్గొని మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయనతోపాటు ఆర్డీవో సాయి ప్రత్యూష, DSP శ్రీనివాస్, ఏసీ ప్రసాద్ పట్నాయక్, పలువురు పాల్గొన్నారు.