జడ్చర్ల బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..!

జడ్చర్ల బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..!

MBNR: జడ్చర్ల బైపాస్ రోడ్డు విషయమై ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం పచ్చజెండా ఊపారు. జడ్చర్ల-HYD జాతీయ రహదారి-44ను, జడ్చర్ల-కల్వకుర్తి జాతీయ రహదారి-167తో అనుసంధానం చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.