ప్రొఫెషనల్ క్రికెటర్‌లా అలరించిన మంత్రి సుభాష్

ప్రొఫెషనల్ క్రికెటర్‌లా అలరించిన మంత్రి సుభాష్

తూ.గో: ప్రజా సేవలోనే కాదు, క్రీడా మైదానం లోనూ తనదైన శైలిలో క్రికెట్ ఆడి తన ప్రతిభను చాటిచెప్పారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. గురువారం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్న ఆటవిడుపు ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో మంత్రి సుభాష్ ప్రొఫెషనల్ క్రికెటర్‌లా అలరించారు.