కోటబొమ్మాళిలో 192 కేసులు పరిష్కారం

కోటబొమ్మాళిలో 192 కేసులు పరిష్కారం

SKLM: కోటబొమ్మాళి కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 192 కేసులు పరిష్కారం అయినట్లు ఫుల్ అండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి ఎం.రోషిని శనివారం తెలిపారు. క్రిమినల్ సివిల్ ఎక్సైజ్ ప్రీ భార్గైనింగ్‌తో పాటు వివిధ రకాల కేసుల్లో ఇరు వర్గాల మధ్య రాజీ చేయడం జరిగిందన్నారు. అదాలత్ సభ్యులుగా బీ. ధర్మారావు, ఎస్. తిరుపతి రావు ఉన్నారన్నారు.