‘మౌలిక వసతులు కల్పించండి’

SKLM: టెక్కలి మండలం పోలవరం పంచాయతీ లచ్చన్నపేట గ్రామస్థులు మౌలిక వసతులపై సోమవారం టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తికి వినతి పత్రం అందించారు. గత 30 ఏళ్లుగా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు.