VIDEO: చైనా మాంజా దెబ్బ.. తృటిలో తప్పిన ప్రమాదం

VIDEO: చైనా మాంజా దెబ్బ.. తృటిలో తప్పిన ప్రమాదం

సూర్యాపేట పట్టణంలోని ఇవాళ కొత్త బస్టాండ్ సమీపంలో నిషేధిత చైనా మాంజా ఓ వాహనదారుడి ప్రాణాల మీదకు తెచ్చింది. గాలిపటం దారం అడ్డురావడంతో సదరు వ్యక్తి అప్రమత్తమై సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. అధికారులు ఆంక్షలు పెట్టినా విక్రయాలు ఆగడం లేదని, సంక్రాంతి వేళ విషాదాలు జరగకముందే పోలీసులు గట్టి నిఘా పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు.