'రైతు సోదరులకు వ్యవసాయ అధికారి పలు సూచనలు'
VKB: దోమ మండల పరిధిలోని రైతులకు వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు పలు సూచనలు చేశారు. సీసీఐకి పత్తి అమ్మదలచిన రైతులు "కపాస్ కిసాన్ యాప్"లో ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతు స్వతహాగా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. స్లాట్ బుక్ అయిన తేదీల్లోనే మిల్లుకు పత్తిని తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.