ఆ ఖైదీకి రూ. 25 లక్షల పరిహారం ఇ‍వ్వండి: సుప్రీం

ఆ ఖైదీకి రూ. 25 లక్షల పరిహారం ఇ‍వ్వండి: సుప్రీం

ఓ నేరస్థుడికి రూ.25 లక్షలను పరిహారంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సోహన్‌కు అత్యాచార కేసులో జీవిత ఖైదు శిక్ష పడగా.. తర్వాత ఆ శిక్షను కోర్టు ఏడేళ్లకు కుదించింది. తన శిక్షా కాలం ముగిసినా.. అదనంగా నాలుగేళ్ల పాటు జైలులోనే ఉండిపోయాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడిన సుప్రీం.. అతడికి రూ.25 లక్షలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది.