రోడ్డుకు మట్టి తోలిన టీడీపీ నాయకులు

రోడ్డుకు మట్టి తోలిన టీడీపీ నాయకులు

సత్యసాయి: రొద్దం మండలం పి. రోప్పాల గ్రామం నుంచి పి. కొత్తపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షానికి బురదగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వెంటనే రోడ్డుకు మట్టి తోలాలని ఆదేశించారు. దీంతో టీడీపీ మండల కన్వీనర్ నరహరి రోడ్డుకు మట్టిని తోలి సమస్య పరిష్కరించారు.