గజపతినగరంలో ఎరువుల దుకాణాలు తనిఖీలు

VZM: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గజపతినగరంలోని ఎరువుల దుకాణాలను జిల్లా కోపరేటివ్ అధికారి రమేష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎసీఎస్‌తో పాటు శివశక్తి ఆగ్రో కెమికల్స్, తదితర దుకాణాలను పరిశీలించారు. ఇందులో భాగంగా రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఏడీఏ నిర్మల జ్యోతి, ఏవో కిరణ్ కుమార్ పాల్గొన్నారు.