VIDEO: డివైడర్‌ను ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం
WGL: ఖిలా వరంగల్ మండలం మామునూరు ప్రాంతంలో మంగళవారం లారీ డివైడర్‌ను ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవలే పోలీసులు ఈ డివైడర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ వల్ల వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.