రేపు అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్ష
ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 16 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతుల ప్రవేశానికి ఈ నెల 8న పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా సమన్వయ అధికారి కె. విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. 6, 7 తరగతులకు ఉదయం 10 నుంచి 11:30 వరకు, 8, 9, 10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.