యుద్ధం ఎఫెక్ట్.. బోసిపోయిన దుబాయ్
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో దుబాయ్ కళ తప్పింది. ఇప్పటివరకు పర్యాటకులతో కళకళలాడిన దుబాయ్ ప్రస్తుతం బోసిపోయింది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్‌లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవ్వడంతో పర్యాటక రంగం కుదేలైంది. వీధుల్లో జనసంచారం సైతం తగ్గిపోయింది.