VIDEO: వాగు గుంతలో పడి 40 గొర్రెలు మృతి
GDWL: ఇటిక్యాల మండలం బోరువెల్లి శివారులో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేత మేస్తూ వాగు దాటుతున్న సమయంలో, లోతైన నీటి గుంతలో ఒకదాని వెనుక మరొకటి నెట్టుకొని దాదాపు 40 గొర్రెలు ఒక్కసారిగా మునిగి మృతి చెందినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. ఈ ఘటనలో తమకు సుమారు రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్నారు.