మున్సిపల్ హాలులో ఉద్యోగ మేళా
W.G: మెప్మా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేళాలో 16 కంపెనీలు పాల్గొన్నాయని, ఇలాంటి అవకాశాలు నిరుద్యోగులకు ఉపయోగపడుతుందన్నారు.