రోడ్డుకు ఇరువైపులా ముళ్ళకంపల తొలగింపు

రోడ్డుకు ఇరువైపులా ముళ్ళకంపల తొలగింపు

ATP: గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో ఇరువైపులా ఏపుగా కంపచెట్లు పెరగడంతో కాలనీవాసులు శనివారం వార్డులో విసిట్‌కు వచ్చిన కమిషనర్ లక్ష్మీదేవికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కమిషనర్ లక్ష్మీదేవి ముళ్ల కంపలను తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. జేసీబీతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళకంపలను తొలగించారు. కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.