మందుబాబులకు బ్యాడ్ న్యూస్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ మార్గదర్శకాల మేరకు పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23న మొదటి దశ, 29న రెండో దశ పోలింగ్ జరగనుండగా.. 21న సాయంత్రం 6 గంటల నుంచి 23న పోలింగ్ ముగిసే వరకు, అలాగే 27న సా. 6 గంటల నుంచి 29న పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి.