VIDEO: గ్యాస్ కొరత.. బారులు తీరిన జనాలు

VIDEO: గ్యాస్ కొరత.. బారులు తీరిన జనాలు

AKP: జిల్లాలో గ్యాస్ కొరత సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇవాళ చోడవరం, రావికమతం మండలాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం ఉదయం నుంచే ప్రజలు ఏజెన్సీల వద్ద బారులు తీరారు. గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదోనన్న భయంతో ఎండను సైతం లెక్కచేయకుండా కిలో మీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా, మరో పక్క గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే.