నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
AKP: ఎలమంచిలి మండలం పురుషోత్తపురం సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పురుషోత్తపురం, పోతిరెడ్డిపాలెం, రుక్మిణిపురం, రేగుపాలెం, రామభద్రపురం, లైన్ కొత్తూరు, వెంకనాయుడుపాలెం గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ రాజశేఖర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.