ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి
NDL: అవుకు పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఇవాళ తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.